తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందిన విషాద ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్‌లో బాబా సిద్ధనాథ్ ఆలయంలో భక్తులు కిక్కిరిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రావణ మాసం నాలుగో సోమవారం కావడంతో భక్తులు భారీగా పోటెత్తారు. ఈ సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆలయంలో పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. అయితే,.. ప్రమాదంలో అధికంగా గాయపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.