ఉండవల్లిలోని నివాసంలో 24వ రోజు ప్రజాదర్భార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రజల నుంచి వినతులను తక్షణమే పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం మంగళగిరిలో MSME ఆటో పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్‌ను మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. వైసీపీ నేతల భూ కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.