29.2 C
Hyderabad
Monday, May 29, 2023

Maha Shivaratri: ఊరూవాడా మహాశివరాత్రి వైభవం ప్రారంభం

Grand Maha Shivaratri Celebrations in AP and Telanagana States: తెలుగురాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో హోరెత్తిపోతున్నాయి. అప్పుడే బ్రహ్మోత్సవాల వైభవంతో శివాలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆది దంపతులుగా కీర్తి పొందిన శివపార్వతులను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి ఆలయం

ముఖ్యంగా శ్రీశైల మహాక్షేత్రం, శ్రీకాళహస్తీశ్వరాలయం, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం కళకళలాడుతోంది.

ఉభయగోదావరి, క్రష్ణా జిల్లాల్లోని నదీతీర ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు, పంచారామాలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. అన్నిచోట్ల శివ భక్తులకు అసౌకర్యం కలగడకుండా దేవాలయ సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీ దర్శనాలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.

శ్రీ కాళ హస్తీశ్వర స్వామి ఆలయం

Maha Shivaratri: నల్లమల కొండ నుంచి కాలినడకన భక్తులు శివనామస్మరణతో శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని చూసేందుకు తండోపతండాలుగా కదిలివెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో అప్పుడే ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడిపోతోంది. శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో ఇసుకేస్తే రాలనంత భక్తులు వచ్చారు.

వసతి కోసం భక్తులు తంటాలు పడుతున్నారు. అన్నదాన సత్రాలు కిక్కిరిసిపోయి ఉన్నాయి. లడ్డూ కౌంటర్ల దగ్గర కూడా చాంతాడంత లైన్లు ఉన్నాయి. దేవస్థానం 15 కౌంటర్లను ఏర్పాటు చేసింది. శ్రీశైల గిరులు శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. శివరాత్రి ముందురోజు రాత్రి స్వామి, అమ్మవార్లకు గజ వాహన సేవ జరగనుంది.

తిరుపతిలోని శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని అతి సుందరంగా పూలతో అలంకరించారు. గాంధర్వ రాత్రిని పురస్కరించుకుని శ్వేతవర్ణాలు, విశేష దివ్యాభరణాలతో ఆది దంపతులైన సర్వేశ్వరుడు రావణ వాహనంపై, శ్రీజ్నాన ప్రసూనాంబికా అమ్మవార్లు కలిసి మయూర వాహనంపై  భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో కోలాటం

తిరుపతిలోని కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు అవతరణలో భాగంగా శ్రీ కామాక్షి సమేత సోమ స్కంధమూర్తి స్వామి వారు వ్యాఘ్ర వాహనంపై ఊరేగారు. భజన మండళ్లు, కోలాటాల ప్రదర్శనలు, మహిళల హారతులతో తిరుపతి పుర వీధులన్నీ కోలాహలంగా మారిపోయాయి.

 

తిరుపతిలోని కపిలేశ్వరస్వామి వ్యాఘ్ర వాహనంపై ఊరేగింపు

Latest Articles

18ఏళ్ళు నిండి రీల్స్ చేసే వారికి తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో నడుస్తున్న ట్రెండ్ రీల్స్. కూర్చున్నా.. నిలబడినా.. తుమ్మినా.. దగ్గినా.. ఏం చేసినా వీడియో తీసి.. దానికి కాస్త బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్