- ఓటు హక్కు వినియోగించుకున్న 74 శాతం మంది ఓటర్లు
- అధికార బీజేపీ, లెప్ట్ -కాంగ్రెస్ కూటమి మధ్య కీలకపోటీ
- మార్చి 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలు

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తయింది. పోలింగ్ ముగిసే సమయానికి 74 శాతం ఓట్లు పోలయ్యాయని అధికారులు తెలిపారు. పోలింగ్ సమయం పూర్తయినా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉన్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతించారు. అధికార బీజేపీ, వామపక్షాలు కాంగ్రెస్ కూటమి మధ్య కీలకపోటీ జరుగుతోంది. మొత్తం 60 స్థానాల అసెంబ్లీకి 374 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3,37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే చురుగ్గా పోలింగ్ సాగింది. ఓట్ల లెక్కింపు , ఎన్నికల ఫలితాల ప్రకటన మార్చి 2న జరుగుతుంది.
