ఆంద్రప్రదేశ్ చేనేత మరియ జౌళి శాఖ, రూమ్9 సహకారంతో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 41లో ని రూమ్9 పాప్ అఫ్ స్టోర్ లో ఏర్పాటు చేసిన సేవ్ ది వీవ్ 6- రోజుల చేనేత వస్త్ర ప్రదర్శన ఆంద్రప్రదేశ్ టెక్స్‌టైల్స్ & హ్యాండ్లూమ్ కమీషనర్ రేఖా రాణి గురువారం ప్రారంభించారు. ఆమెతో పాటు నటి, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ వ్యవస్థాపకురాలు రేణు దేశాయ్ కూడా జ్యోతి ప్రజల్వన చేశారు.
చేనేత కార్మికుల అభ్యున్నతికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, చేనేత వస్త్రం అమ్మ చల్లని ఒడి వంటిందని రేఖా రాణి అభివర్ధించారు. రేణి దేశాయ్ మాట్లాడుతూ భారతీయ సంస్క-తిలో చేనేతకు ప్రత్యేక స్ధానం ఉందని, నేటి యువత బాధ్యతగా చేనేతను ఆదరించి, ప్రోత్సహించాలన్నారు. రూమ్9, సెలేబ్రిటీ సీక్రెట్స్ ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ కొనసాగుతున్న ప్రదర్శనలో ఆంద్రప్రదేశ్ లో ని అనేక జిల్లాల నుండి ఇక్కడ హ్యాండ్ లూమ్ , పట్టు, కాటన్, డ్రెస్ మేటీరియల్స్, హ్యాండిక్రాప్ట్స్ వంటి వేలాది రకాల వస్త్రోత్సత్తులు అందుబాటులో ఉంచారని వివరించారు.
పద్మశ్రీ అవార్డీ పద్మజా రెడ్డి, సామాజికవేత్త విలేఖ బోయపాటి, నటి ప్రగతి మహావాది, కాలా తాటికొండ – డా. నిర్లేపా క్రొవ్విడి IAS & CSB IAS అకాడమీ వ్యవస్థాపకురాలు బాల లత మల్లవరపు, తెలంగాణ అదనపు కార్మిక కమిషనర్ డాక్టర్ ఈ.గంగాధర్, తదితరులు హాజరయ్యారు