నేడు ఐపీఎల్(IPL)లో డబుల్ ధమాకా ప్రేక్షకులకు మజా ఇవ్వనుంది. తొలి మ్యాచులో సనరైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య తలపడనున్నాయి. మధ్యాహ్నం 3.30గంటలకు హైదరాబాద్ ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 2019 తర్వాత హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లు జరగనుండడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. 2016లో ఐపీఎల్(IPL) టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ ఆ తర్వాత సీజన్లు నుంచి విఫలమవుతూ ఫ్యాన్స్ ను నిరాశపర్చింది. కొత్త కెప్టెన్ మార్క్‌రమ్ నాయకత్వంలో ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో బరిలోకి దిగుతుంది. అయితే మార్కరమ్ కొన్ని మ్యాచులకు అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు.
ఇక రెండో మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ ఢీ కొట్టనున్నాయి. ఈ సాలా కప్ నమ్ దే నినాదంతో ప్రతిసారి బరిలో దిగే ఆర్సీబీ బోల్తాపడుతోంది. దీంతో ఈసారైనా కప్ కొట్టాలని భావిస్తోంది. ఇక ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై కూడా విజయంతో ఈ సీజన్ ను ప్రారంభించాలని చూస్తోంది. రాత్రి 7.30గంటలకు బెంగళూరు వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది.