CPI – CPM | వందేళ్ల చరిత కలిగిన పార్టీకి ఈ రోజు పండగ రోజు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బతికి ఉన్నంత కాలం జెండాను మొద్దామని.. చనిపోయాక కూడా జెండా కప్పుకొని చనిపోదామని పార్టీ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్స్ లో రాష్ట్ర సీపీఐ, సీపీఎం ఉమ్మడి సమావేశం ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో పాల్గొన్న కూనంనేని నాయకులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఐ – సీపీఎం కలిసి సమావేశం కావడం చరిత్రలో ఇది తొలిసారి అని వ్యాఖ్యానించారు. ఇది శుభోదయం, ఒక అరుణోదయం..అలాగే ఈ సమావేశం ఒక యూనిక్ అని వ్యాఖ్యానించారు. రెండు పార్టీల జెండాలు ఒక్కటి చేసి ప్రజల సమస్యలపై కొట్లాడదామని పిలుపునిచ్చారు. బీజేపీ జెండా మోసిన వాళ్లకి మనం దూరంగా ఉన్నామని… వాళ్ళంతట వాళ్ళు వస్తేనే మద్దతు ఇస్తున్నామే తప్ప… మనం ఎన్నడూ కూడా వాళ్ళ వద్దకు వెళ్ళలేదని అన్నారు.