స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో స్కూల్స్ ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నాడు-నేడు పనుల పురోగతి, విద్యాకానుక, అమ్మ ఒడి అమలుపై చర్చించనున్నారు.
అంతేకాకుండా.. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇది పూర్తైతే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉందన్నారు. నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంపైనా సీఎం సమీక్ష జరిపారు. పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. షెడ్యూలు ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలని తెలిపారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దాలని.. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.