31.2 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

‘మదం’ చూడాలంటే గుండె ధైర్యం కావాలట

హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్, ఇనయ సుల్తాన ప్రధాన పాత్రల్లో ఏకైవ హోమ్స్ ప్రై.లి. బ్యానర్ మీద సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన్న బాబు), రమేష్ బాబు కోయ నిర్మించిన చిత్రం ‘మదం’. ఈ చిత్రానికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మార్చి 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన టీజర్‌ను తండేల్ సినిమాతో పాటుగా థియేటర్లలో యాడ్ చేశారు. ప్రస్తుతం మదం మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ టీజర్ సక్సెస్ అయిన సందర్భంగా యూనిట్ మాట్లాడుతూ..

డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ.. ‘మా మదం సినిమా మార్చి 14న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా నిర్మాత రమేష్ గారు ఇచ్చిన కథను చూసినప్పుడు నాకు చాలా భయమేసింది. ఇంతటి రా, రస్టిక్ సినిమా తెలుగులో రావడం అరుదు. తమిళ్, మలయాళీ భాషల్లో ఇలాంటి కంటెంట్ వస్తుంటుంది. మదం కథ నాకు చాలా నచ్చింది. ఇలాంటి క్లైమాక్స్‌ ఇప్పటి వరకు ఇండియన్ సినీ హిస్టరీలో రాలేదు. ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి’ అని అన్నారు.

రైటర్ రమేష్ బాబు కోయ మాట్లాడుతూ.. ‘నా కథను ఇంత అద్భుతంగా తీసిన వంశీకృష్ణకు థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీజర్‌ను ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు ధన్యవాదాలు’ అని అన్నారు.

ఇనయ సుల్తానా మాట్లాడుతూ.. ‘నాకు నెగెటివ్ పాత్రలు చేయడమంటే ఇష్టం. మదం చిత్రంలో నేను చాలా ఇంపార్టెంట్ కారెక్టర్‌ను చేశాను. మా డైరెక్టర్ వంశీ గారు సినిమాను అద్భుతంగా తీశారు. నా క్లిష్ట పరిస్థితుల్లో వంశీ గారు సపోర్ట్‌గా నిలిచారు. నేను బాగా నటించడానికి ఆయనే కారణం. లత నాకు మంచి స్నేహితురాలు. హర్ష చాలా రియలిస్టిక్‌గా నటించాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. మార్చి 14న సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

హర్ష గంగవరపు మాట్లాడుతూ.. ‘మదం సినిమాకు కథే హీరో. ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయి. కథ చాలా బాగుంటుంది. దానికి తగ్గ పాత్రలు అందరికీ పడ్డాయి. అన్ని కారెక్టర్స్ బాగుంటాయి. నటించే స్కోప్ అందరికీ దొరికింది. మా రమేష్ గారి కథ, వంశీ గారి మేకింగ్ అద్భుతంగా ఉంటుంది. అందరికీ మా సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

లతా విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘నా నిజ జీవితంలో దగ్గరగా ఉండే పాత్రను పోషించాను. అందుకే నాకు ఎక్కడా కష్టంగా అనిపించలేదు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నా ఫ్రెండ్ ఇనయతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. హర్షతో నటించడం సంతోషంగా ఉంది. మా సినిమా మార్చి 14న రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

Latest Articles

బర్డ్‌ ఫ్లూ.. చికెన్ తినాలా.. వద్దా?

బర్డ్‌ ఫ్లూ.. ఇప్పుడు ఈ పేరు మాంసాహారప్రియులను కలవరపెడుతోంది. చికెన్‌ లేనిదే ముద్ద దిగని వారు ఇప్పుడు తినాలా వద్దా.. అని తెగ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కోళ్లఫారాల్లో బర్డ్‌ ఫ్లూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్