బుట్టబొమ్మ అనగానే అందరికీ గుర్తొచ్చేది పూజా హేగ్డే. ఆమధ్య వరుసగా స్టార్ హీరోలతో వర్క్ చేసి క్రేజీ హీరోయిన్ అయ్యింది. ఆతర్వాత అమ్ముడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.. టాలీవుడ్ లో ఆఫర్స్ మిస్ చేసుకుంది. సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తోన్న ఈ బుట్టబొమ్మకు ఇప్పుడు లక్కీ ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. బుట్టబొమ్మకు వచ్చిన ఆ లక్కీ ఛాన్స్ ఏంటి..?
బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి టాలీవుడ్ ని మిస్ చేసుకోవడంతో.. ఈమధ్య పూజా హెగ్డే పేరు పెద్దగా వినిపించడం లేదు. దీనికి తోడో కొత్తమ్మాయిల హవా ఎక్కువ అవ్వడంతో పూజా కాస్త సైడ్ అయ్యింది. ఇప్పుడు ఈ బ్యూటీకి ఓ సూపర్ ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. మేటర్ ఏంటంటే.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో పూజా ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో కూలీ అనే భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం.. పూజా హెగ్డేని కాంటాక్ట్ చేశారని.. ఈ అమ్ముడు కూడా ఈ పాటలో డ్యాన్స్ చేసేందుకు ఓకే చెప్పిందని సమాచారం.
పూజా హెగ్డేకి ఐటెమ్ సాంగ్స్ చేయడం కొత్తేం కాదు. రంగస్థలం మూవీలో జిగేల్ రాణి అంటూ అదరగొట్టింది. అలాగే ఎఫ్ 3 మూవీలో కూడా ఐటం సాంగ్ లో మెరసింది. అయితే.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైమ్. కాబట్టి తనకు ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పచ్చు. పైగా ఇది కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మూవీ. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా నటిస్తుండడం విశేషం. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. మే 1 రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఆగష్టు 15న కూలీ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా పూజాకు ఇది లక్కీ ఛాన్సే. మరి.. ఈ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.