తెలంగాణ ప్రభుత్వం అత్యంత కొత్త హంగులతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ఈనెల 30న నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 600మంది స్పెషల్ పోలీసులతో భద్రత కల్పించడంతో పాటు 300 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీజీసీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ ఆనంద్ కొత్త సచివాలయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కమాండెంట్ స్థాయి అధికారితో భద్రతను పర్యవేక్షించనున్నారని తెలిపారు. కాగా ఇప్పటికే విడుదలైన సచివాలయం డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.