కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతామని సోనియా గాంధీ తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయడం కూడా.. రాష్ట్రం ఇచ్చిన వాళ్లుగా తమ మీద బాధ్యత ఉందని తెలిపారు. కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని తెలంగాణ ప్రజలను కోరారు. ఈ క్రమంలోనే.. మహిళల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించారు సోనియా. మహాలక్ష్మి పథకం కిందా.. ప్రతి నెలా 2,500 ఆర్థిక సాయం అందించనున్నామన్నారు. దాంతో పాటుగా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. ఇక మహిళ కోసం ప్రత్యేకంగా.. కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించారు.
వీటితో పాటు సోనియా గాంధీ ప్రకటించిన పథకాల వివరాలు..
*రూ.500 లకే గ్యాస్ సిలిండర్
*ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం
*ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
*ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం
*రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం
*వ్యవసాయం కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్
*గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు
*చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్
*రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు