27.2 C
Hyderabad
Thursday, October 23, 2025
spot_img

ఈసారి మహిళలే టార్గెట్.. ప్రత్యేక పథకాలు ప్రకటించిన సోనియా గాంధీ

స్వతంత్ర వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తోన్న కాంగ్రెస్ పార్టీ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పథకాలను ప్రకటించింది. అధికారంలో వచ్చాక పక్కాగా అమలు చేస్తామని చెప్పేందుకు ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన సభలో ఆ గ్యారంటీ పథకాలతో పాటు మరికొన్ని కీలక పథకాలు కూడా ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక హామీలు ప్రకటించారు. తెలంగాణలో త్వరలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్.. ఆరు గ్యారంటీ పథకాలతో పాటు కీలక హామీలను ఈ సభా వేదికగా ప్రకటించారు. అయితే.. ఇందులో ప్రధానంగా.. మహిళా ఓటర్లే మెయిన్ టార్గెట్‌గా ప్రత్యేక హామీలు ప్రకటించారు సోనియా గాంధీ. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టటం ఖాయమని సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. ఈ ఆరు గ్యారంటీ పథకాలను రాష్ట్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని.. అప్పుడే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమన్నారు. ఇదే తన కోరిక అని సోనియా గాంధీ ప్రకటించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెడతామని సోనియా గాంధీ తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేయడం కూడా.. రాష్ట్రం ఇచ్చిన వాళ్లుగా తమ మీద బాధ్యత ఉందని తెలిపారు. కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని తెలంగాణ ప్రజలను కోరారు. ఈ క్రమంలోనే.. మహిళల కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించారు సోనియా. మహాలక్ష్మి పథకం కిందా.. ప్రతి నెలా 2,500 ఆర్థిక సాయం అందించనున్నామన్నారు. దాంతో పాటుగా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. ఇక మహిళ కోసం ప్రత్యేకంగా.. కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించారు.

వీటితో పాటు సోనియా గాంధీ ప్రకటించిన పథకాల వివరాలు..

*మహాలక్ష్మీ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
*రూ.500 లకే గ్యాస్ సిలిండర్
*ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం
*ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
*ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం
*రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం
*వ్యవసాయం కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్
*గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు
*చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్
*రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్