28.2 C
Hyderabad
Tuesday, May 28, 2024
spot_img

దాహంతో గొంతెడుతున్న ఏజెన్సీలు

  ఆదిలాబాద్‌ జిల్లా లోని ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో అప్పుడే తాగునీటి తండ్లాట మొదలైంది. ఆదివాసీలు దాహంతో అల్లాడుతున్నారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు పగటి ఉష్ణోగ్రత లు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం గిరిజను లదరికి చేరడం లేదు. ఏజెన్సీలో ఆదివాసీ గిరిజనులకు ఇప్పటికీ వ్యవసాయ బావులే దిక్కవుతు న్నాయి. ఆదివాసులు, గిరిజనుల దాహార్తిపై స్వతంత్ర ప్రత్యేక కథనం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల నర్సాపూర్ పంచాయతీ పరిధిలోని గ్రామంలో స్థానికులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో దగ్గరలోని వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సివస్తోంది. ఇలాంటి పరిస్థితులే… మరెన్నో, ఆదివాసీ గూడాల్లో తాగునీటి ఎద్దడి కనిపిస్తోంది. ఏజెన్సీప్రాంతంలో, ఉట్నూర్ ఇంద్రవెల్లి, నార్నూర్‌, గాదిగూడ మండలాల్లోని పలు ఆదివాసీ గూడాల్లో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గిరిజనులు కలుషిత నీటిని తాగి విష జ్వరాల బారిన పడుతున్నారు. ఇప్పటికే గ్రామాల సమీపంలోని వాగులు, కుంటలు అడుగంటడంతో తాగునీటి ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. మిషన్‌ భగీరథ పైపులైన్‌ వేసిన అధికారులు సక్రమంగా నీటిని సరఫరా చేయడం లేదని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి సమస్యలను పరిష్కరిస్తే మారుమూల గిరిజనగూడెంలలో తాగునీటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. కానీ, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏజె న్సీలో పరిస్థితి ఇలా ఉంటే… అధికారులు మాత్రం ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నామని ప్రచారం చేసుకోనడం గమనార్హం.

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలకు వ్యవసాయ బావులే దిక్కయ్యాయి. ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభు త్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథతో ఆశించిన స్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదు. వేసవి ప్రారంభం లోనే నీటి ఎద్దడి మొదలైంది. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఫలితంగా ఆది వాసీ గిరిజనులకు వ్యవసాయ బావులే దిక్కవుతున్నాయి. అందుబాటులో ఉన్న వ్యవసాయ బావుల నుంచి తాగునీటిని తీసుకొచ్చి దాహం తీర్చుకుంటున్నారు. వేసవిలో ఈ బావుల్లోనూ నీటి నిల్వలు అడుగంటుకుపోవడంతో ఒర్రెలు, వాగుల్లో చెలిమెలు తవ్వి తాగునీటిని ఆదివాసీలు తెచ్చుకొంటున్నారు. మైదాన ప్రాంతా ల్లో కొంత మేరకు మిషన్‌ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా.. ఏజెన్సీ గ్రామాల్లోనే సమస్య తీవ్రంగా ఉంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకూ వ్యవసాయ బావుల వద్దనే పడిగాపులు పడాల్సి వస్తోంది. నిత్యం కిలోమీటర్ల నడకతో నీటిని తీసుకొంటున్నారు. మండుతున్న ఎండల కు వ్యవసాయ బావులు కూడా ఎండిపోవడంతో గిరిజనుల నీటి కష్టాలు తీరడంలేదు.

ఏజెన్సీలో గుక్కెడు మంచి నీళ్లయిన దొరక్కపోవడంతో అందుబాటులో ఉన్న కలుషిత నీటిని తాగుతూ ఆదివాసీలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రధానంగా కిడ్నీ వ్యాధులతో మంచం పడుతు న్నారు. ప్రతియేటా వేసవిలోనే తాగునీరు లభించక కలుషిత నీటితో గొంతు తడుపుకోక తప్పని పరిస్థితి. దాదాపు చాలా గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా పైపులైన్‌ వేసినప్పటికీ.. నీటి సరఫరా చేయక పోవడంతో ఈ కష్టాలు తప్పడంలేదు. ఆదివాసుల అనారోగ్యాలకు కలుషిత జలాలే.. కారణమని ప్రభుత్వం గుర్తించినా.. దిద్దుబాటు చర్యలను చేపట్టడం లేదు. మిషన్‌ భగీరథ నీరు రావడం లేదని చాలాసార్లు ఫిర్యాదు చేసినా… ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రతియేటా వర్షాకాల లోనూ డయేరియా, టైఫాయిడ్‌ లాంటి వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. గిరిజనుల అనారోగ్య సమస్యల పై వైద్య ఆరోగ్య శాఖ కూడా దృష్టి సారించకపోవడంతో ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడు తున్నాయి. కనీసం క్లోరినేషన్‌ చేయకుండానే నీటిని తాగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పంచాయతీ సిబ్బంది కూడా పట్టించుకోవడంలేదు. గిరిజన గూడెంలకు మిషన్‌ భగీరథ నీళ్లు వస్తాయని ఎంతో కాలంగా ఎదురు చూసినా ప్రయోజనం లేదు. గ్రామంలో ట్యాంకు నిర్మాణం చేపట్టి పైపు లైన్‌ పూర్తి చేసినా.. నీటిని సరఫరా చేయడం లేదు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదు. ఇప్పటికీ కొందరికి కనెక్షన్‌ కూడా ఇవ్వలేదని గిరిజనులు అంటున్నారు. ఇకనైనా నర్సా పూర్ గ్రామానికి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Latest Articles

ఆ ప్రశ్నకు ‘ల‌వ్‌, మౌళి’లో సమాధానం దొరుకుతుంది: నవదీప్

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్