మేడ్చల్ పట్టణ పరిధిలోని సత్య నగర్ కాలనీలో పార్కు స్థలం కబ్జాకు గురైందని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి కాలనీవాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. 2వేల గజాల తమ లే అవుట్‌లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు రియాల్టర్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పార్కు స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని కాలనీవాసులు, కాలనీ ప్రెసిడెంట్ సదరు రియల్టర్లను హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని పార్కు స్థలానికి సంబంధించిన సర్వే కూడా చేపడతామని చెప్పినట్లు కాలనీవాసులు తెలిపారు. మేడ్చల్ పట్టణంలో పార్కు స్థలాలను కబ్జా కాకుండా కాపాడుకుందాం అని కాలనీవాసులు నినాదాలు చేశారు.