తెలంగాణ ప్రభుత్వం సీసీఎస్ ప్రక్షాళన చేపట్టింది. సీసీఎస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్-2కు రిపోర్ట్ చేయాలని 12 మంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లకు సీపీ ఆదేశించింది. సీసీఎస్ లో అవినీతి ఆరోపణలతో సీపీ చర్యలు తీసుకోగా, వెంటనే రిలీవ్ చేయాలని డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఏసీపీ ఉమామహేశ్వర్, సీఐ సుధాకర్ అరెస్ట్ అయ్యారు. సీసీఎస్‌పై వరుస అరోపణల తో తాజాగా 12 మందిని బదిలీ చేశారు. అయితే ఒకే సారి 12 మంది ఇన్స్‌పెక్టర్లపై బదిలీ వేటు వేయడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.