కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గత తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి మతహింస జరగలేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ శాంతియు తంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లా, ఆర్డర్ రెండూ లేవని విమర్శించారు. గతంలో ఎప్పుడూ మతపరమైన కార్యకలాపాలు జరగని, ప్రశాంతమైన మెదక్ పట్టణంలో హింస చెలరేగడం నిజంగా సిగ్గుచేటు అని కేటీఆర్ విమర్శించారు. మెదక్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొందని, మెదక్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారం టూ ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.