16.7 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఎండలు

   తెలుగు రాష్ట్రాలను ఎండలు కుదిపేస్తున్నాయి. రాత్రి ఉక్కుపోత, పగలు బీభత్సమైన ఎండలతో ప్రజలు అల్లాడిపో తున్నారు. తెలంగాణలో మొన్నటి వరకు పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఏకంగా 18 జిల్లాల్లో ఆ స్థాయి టెంపరేచర్లు రికార్డుయ్యాయి. 40కి పైగా మండలా ల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం, ఖమ్మం జిల్లా పమ్మి మండలం, జగిత్యాల జిల్లా నేరెళ్లలలో 46.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. 11 జిల్లాల్లో 45 నుంచి 45.9 మధ్య, నాలుగు జిల్లాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం పాటు టెంపరేచర్లు ఇదే స్థాయిలో ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది.

     ఇక ఏపీలో సైతం ఎండలు దంచికొడుతున్నాయి. వేడిగాలుల తీవ్రతా పెరిగింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలుల దెబ్బకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ 58 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు, 169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు. నిన్న 63 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో వేడిగాలులు వీచాయన్నారు. అత్యధికంగా నంద్యాల జిల్లాలోని గోస్పాడు, బండి ఆత్మకూరులో ఏకంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై నట్లు సమాచారం. వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిన్న ఐదుగురు చనిపోయినట్లు తెలు స్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్