28.2 C
Hyderabad
Thursday, November 21, 2024
spot_img

ముదురుతున్న నీట్ వివాదం

    నీట్ యూజీ పరీక్ష వివాదం మరింత ముదురుతోంది. అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై బిహార్‌ ఆర్థిక నేర విభాగం చేపట్టిన దర్యాప్తులో కీలక విషయా లు వెలుగుచూస్తు న్నాయి. మరి లీకేజీ ఎలా జరిగింది..? దీని వెనక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవ రు..?

   దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశ పరీక్ష 2024’లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ బీజేపీపై ప్రతిపక్షాలు దుమ్మె త్తి పోస్తున్నాయి. ముఖ్యంగా మోదీ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి విపక్షాలు. దీంతో నీట్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇక ఓవైపు అక్రమాలకు తావు లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తుండటంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.

  లీకేజీ డొంక కదిలించేందుకు రంగంలోకి దిగారు బిహార్‌ ఆర్థిక నేర విభాగం అధికారులు. ఈ క్రమంలోనే నీట్‌ పేపర్‌ను లీక్‌ చేసిన ముఠా 30 లక్షల చొప్పున చాలా మందికి అమ్మినట్లు బయటపడింది. ప్రశ్న పత్రం లీక్‌ చేయడం, రహస్య ప్రాంతానికి విద్యార్థులను తీసుకెళ్లి జవాబులు బట్టీ పట్టించడానికి పేపర్‌ లీకేజీ ముఠా పక్కా ప్రణాళికను అమలు చేసిన ట్టు విచారణలో తేలింది. ఇందుకుగానూ ఒక్కో విద్యార్థి నుంచి 30 – 32 లక్షలు వసూలు చేసినట్టు నిందితులు పోలీసులకు ఇచ్చి వాంగ్మూలంలో అంగీకరిం చారు. దీంతో మరింత లోతైన విచారణ జరిపేందుకు లీక్‌ అయిన పేపర్లు పొందారని భావిస్తున్న తొమ్మిది మంది విద్యార్థులను విచారణకు హాజరు కావాలని బీహార్‌ ఆర్థిక నేరాల విచారణ విభాగంనోటీసులు జారీ చేసింది. మొత్తం 13 మంది నీట్‌ అభ్యర్థులు ఈ పేపర్‌ లీక్‌లో భాగస్వాము లైనట్లు అధికారులు గుర్తిం చారు. ఇందులో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేయగా మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తం గా చర్చనీయాంశంగా మారింది. నీట్‌లో అవకతవకల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే బృందం తో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఈ పరీక్షను సమర్థ వంతంగా ఎలా నిర్వహించాలనే దానిపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ప్రధానమంత్రి మౌనంగా ఉండటం సరికాదన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీ లు ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని సిబల్‌ విజ్ఞప్తి చేశారు.

    కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ విమర్శించారు. ఓవైపు బీహార్‌లో 30 లక్షల నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని, ఇప్పటికే ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం దారుణమన్నారు. ఆది నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని తీవ్రంగా విమర్శిం చారు.అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్‌పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్న ప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు.ఇలా లీకేజీ వ్యవహారం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ ముదురుతోంది. మరోపక్క లీకేజీ వ్యవహారంపై సిట్‌, ఆర్థిక విభాగం దర్యాప్తు కొనసాగుతోంది. మరి విచారణలో అసలు నేరస్తులు బయటపడతారా..? తదుపరి చర్యలు ఏంటి..? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయ న్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Latest Articles

పీసీబీ నివేదిక రాగానే విశాఖలో కాలుష్యంపై చర్యలు – పవన్‌

పీసీబీ నివేదిక రాగానే విశాఖలో కాలుష్యంపై చర్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాన్ తెలిపారు. విశాఖ తీరంలో వాయు కాలుష్యంపై శాసన మండలిలో పలువురు సభ్యుల ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్