స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో రేపటి నుంచి బడి గంట మోగనుంది. సమ్మర్ హాలిడేస్ పూర్తి చేసుకున్న విద్యార్థులు రేపటి నుంచి స్కూళ్లలో అడుగు పెట్టనున్నారు. ఇక ఈ విద్యా సంవత్సరం ప్రారంభదశలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ ఇవ్వాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటికే 86 శాతం టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ పూర్తి చేసుకొని తెలంగాణలో అన్ని జిల్లాలకు చేరుకోగా, విద్యార్థులకు ఇచ్చే రెండు జతల యూనిఫాం కూడా అధికారులు స్కూళ్లకు చేరవేస్తూన్నారు. ఇక ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రతి నెలా నాలుగో శని వారం నో బ్యాగ్ డే తో పాటు ప్రతి రోజూ యోగా, ఆటపాటలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది.