28.2 C
Hyderabad
Tuesday, January 27, 2026
spot_img

అల్లర్లను అరికట్టడంలో పోలీసులు విఫలం

   ఎన్నికలు అంటేనే పోలీసులకు సవాలుగా మారే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి. పోలింగ్ జరగడానికి కొన్ని నెలల ముందే సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు గూర్చి అనేక సమావేశాలు నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తారు. ఎన్నికల సమయం దగ్గర నుంచే కాకుండా నిరంతరం వివాదాస్పదంగా ఉన్న తాడిపత్రిలో అయితే ఈ తరహా ఘటనలు ఊహించదగ్గవే అయినా తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. అందుకు గాను ఈసీ అనంత పురం ఎస్పీ అమిత్ బర్దర్‌పై చర్యలు తీసుకొంది.

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్‌ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో పోలీసులు విఫలమైనందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. జిల్లా ఎస్పీతో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణను సస్పెండ్‌ చేసింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు పోలింగ్‌ రోజున పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. వైసీపీ వర్గీయులు టీడీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటిపై సైతం దాడి చేశారు. మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్‌ దాసరి కిరణ్‌ను డీఎస్పీ చైతన్య ఆదేశాలతో పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులు ఆస్పత్రిపాలయ్యాడు. ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన సీరియస్‌ అయ్యింది.దీంతో సీఈసీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. సీఈసీ ఆదేశాల మేరకు ఎస్పీ అమిత్‌ బర్దర్‌, డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. తాడిపత్రిలో పరిస్థితినీ అదుపులోకి తీసుకురావడానికి ఐదు జిల్లాల ఎస్పీలతో పాటు డీఎస్పీ లను కూడా తాడిపత్రికి పంపారు. ఇందులో ఒకరైన డీఎస్పీ చైతన్యను నియమించడం ఇక్కడ వివాదాస్పదం అవుతోంది. గతంలో తాడిపత్రి డీఎస్పీగా విధులు నిర్వహించిన చైతన్యపై అధికారి పార్టీకి అనుకూలంగా ఉన్నాడనే ఆరోపణలపై ఆయనను బదిలీ చేశారు. ఇటీవల జరిగిన అల్లర్ల నేపథ్యంలో తాడిపత్రికి రప్పించడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. అంతేకాకుండా జేసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్‌ను విచక్షణారహితంగా కొట్టారు. అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన్ను అనంత పురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టీడీపీ నాయకులు ఆయన వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ చైతన్యపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో తాడిపత్రిలో ఏ స్థాయిలో గొడవలు జరుగుతాయో తెలియంది కాదు. అలాంటి ప్రాంతంలో హింస చెలరేగుతుందని ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, కొత్తగా వచ్చిన డీఐజీ, ఎస్పీకి ఈ విషయం గురించి స్పెషల్‌ బ్రాంచ్‌ చెప్పలేదా..? అన్న చర్చ నడుస్తోంది. పోలింగ్‌ రోజున గొడవలు మొదలైతే.. మరుసటి రోజు వరకూ నియంత్రించలేకపోవడం విస్మయం కలిగిస్తోంది. డీఎస్పీ చైతన్య గతంలో తాడిపత్రిలో ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. అలాంటి అధికారిని అల్లర్లు జరిగే సమయంలో తీసుకురావడం మరో తప్పిదం. ఆయన వ్యవహార శైలి గురించి ఎస్పీ, డీఐజీకి చెప్పాల్సిన బాధ్యత స్పెషల్‌ బ్రాంచి వారిదే. డీఎస్పీ చైతన్య లాంటి అధికారి తాడిపత్రికి వెళితే వివాదాలు సద్దుమణగడం మాని కొత్త సమస్యలు తలెత్తుతాయని పోలీసు శాఖలో ఎవరిని అడిగినా చెబుతారు. కానీ ఆయన్నే తాడిపత్రికి పంపించారు. రెండు పార్టీల గొడవల్లో ఎవరెవరు పాల్గొన్నారోగాని, సంబంధమే లేని వ్యక్తులు పారిపోవాల్సి వస్తోంది. రాజకీయ నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరూ అజ్ఞాతంలోకి వెళుతున్నారు. తాడిపత్రి పట్టణంలోని వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పోలీసు కేసుల భయం పట్టుకుంది. రెండు రోజులుగా కేంద్ర బలగాలు పట్టణంలో నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నాయి. చుట్టు పక్క మండలాలలోనూ తనిఖీలు పెంచారు. దీంతో ఎవరికివారు బ్యాగులు సర్దుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోతు న్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గొడవల్లో పాల్గొన్నవారిని గుర్తిస్తున్నారు. వరుసగా అరెస్ట్‌ చేస్తున్నారు. దీంతో నాయకుల్లో వణుకుపుడుతోంది. పోలీసుల కంటపడకుండా తోటలు, కొండల్లో తలదాచుకుంటున్నారు. వారికి మూడు పూటలా భోజనం సమకూర్చలేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రభోదానంద ఆశ్రమం వద్ద జరిగిన గొడవలకు సంబంధించిన కేసులో వందల సంఖ్యలో నిందితులను చేర్చారు. కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ కేసు ఇప్పటికీ నడుస్తోంది. దీంతో తాజా గొడవల్లో తమ పేరు ఎక్కడ చేరుస్తారోనని పలువురు ఆందోళన చెందుతున్నా రు.

తాడిపత్రి పట్టణానికి చుట్టుపక్కల గ్రామాలు, పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి మండలాల రైతులు, చిరువ్యాపారులు ప్రతిరోజూ వస్తుంటారు. నిత్యావసరాలు, పరికరాలు, మందులు కొనుగోలు చేస్తుంటారు. వ్యవసాయ దిగుబడులను మార్కెట్‌కు తెచ్చేవారూ ఉంటారు. పోలీసుల ఆంక్షలతో వీరందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణానికి రావాలంటే చెక్‌పోస్టు వద్ద తమ గుర్తింపు కార్డులను చూపించాల్సి వస్తోందని అంటున్నారు. గుర్తింపు కార్డులు లేనివారి పోలీసులు వెనక్కి పంపుతున్నారు. తాడిపత్రి గొడవలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 91 మందిపై ఐపీసీ సెక్షన 307 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వారిని నిన్న ఉరవకొండ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో టీడీపీకి చెందిన 54 మంది, వైసీపీకి చెందిన 37 మంది ఉన్నారు. అరెస్టు అయిన వారిలో టీడీపీకి చెందిన మల్లికార్జునరెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, వైసీపీకి చెందిన బొంబాయి రమే‌ష్‌నాయుడు, బాలా రమేష్‌బాబు, కంచం రాంమోహనరెడ్డి, జావిద్‌ఖాద్రీ, నాగభూషణం తదితరులు ఉన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రణక్షేత్రాన్ని తలపించాయి. దాడులతో నేతలతో ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేశారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ 144 సెక్షన్ అమల్లో ఉంది. మరోవైపు భద్రతా వైఫల్యాల కారణంగా పోలీసు ఉన్నతాధికారులపై ఈసీ చర్యలకు దిగింది. కేంద్ర బలగాల సహాయంతో పోలీసులు దాడులకు పాల్పడ్డవారిని అరెస్ట్‌ చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్