ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ఘర్షణల్లో ఓ భారతీయుడు మృతిచెందాడు. హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా చేసిన క్షిపణి దాడి వల్లే ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ భావి స్తోంది.
లెబనాన్ భూభాగం నుంచి చేసిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లో ఓ భారతీయుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కేరళకు చెందినవారు. మృతుడు కేరళలోని కొల్లామ్‌కు చెందిన పట్నిబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. ఈ దాడిలో గాయపడిన జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌కు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గలియట్ అనే వ్యవసాయ క్షేత్రంపై ట్యాంకు విధ్వంసక క్షిపణి దాడి జరిగినట్లు అధి కారులు తెలిపారు. ఈ దాడి హెజ్‌బొల్లా పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. హమాస్‌కు మద్దతుగా ఈ గ్రూప్ ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీనికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో ఈ గ్రూప్‌పైనా IDF దాడులు చేపడుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు ఏడుగురు పౌరులతో పాటు 10 మంది సైనికులు మరణించినట్లు IDF తెలిపింది.


