29.2 C
Hyderabad
Tuesday, September 26, 2023

అనంతనాగ్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్.. ఇప్పటికి నలుగురు దుర్మరణం

స్వతంత్ర వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఆర్మీ, ఓ పోలీసు అధికారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది.  ఈ ఎన్ కౌంటర్ లో తొలుత ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు,., ఒకరు కనిపించకుండా పోయారు. గాయాలతో ఒక జవాను శుక్రవారం మరణించాడు. కోకెర్ నాగ్ అనే దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఆర్మీ కల్నల్ సింగ్, మేజర్ ధ్యాంచెక్ తోపాటు జమ్మూ కశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన డీఎస్పీ అధికారి  హిమయూన్ భట్ ఉగ్రవాదుల కాల్పులతో తొలుత మరణించారు.

 

 

దీంతో అప్పటి నుంచి జాయింట్ ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతూనే ఉంది. అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తున్నారు. డ్రోన్లతో బాంబులను విడుస్తున్నారు. దట్టమైన అడవిలో నక్కిన ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం భద్రతా బలగాలు తమ దాడిని మరింత తీవ్రతరం చేశాయి. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు బాంబుల చప్పుళ్లతో దద్దరిల్లిపోతున్నాయి. మరోవైపు మరణించిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధ్యాంచెక్ మృతదేహాలను శుక్రవారం ఉదయం పానిపట్ కు తరలించారు. డీఎస్పీ హుమయూన్ భట్ కు బుద్గాంలో తుది క్రియలు నిర్వహించారు. ఉగ్రవాదుల చేతుల్లో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా జమ్మూ పట్టణంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

Latest Articles

మా నమ్మకం నిజమైంది: ‘అష్టదిగ్బంధనం’ దర్శకుడు బాబా

ఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్‌ సమర్పణలో బాబా పి.ఆర్‌. దర్శకత్వంలో మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ నిర్మించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. సూర్య, విషిక జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150కి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్