ఆంధ్రప్రదేశ్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించినందున టీడీపీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ‘ఓటు ఆయుధం అన్న అంబేద్కర్ స్ఫూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు..ఈ ఎన్నికల ద్వారా టీడీపీ నమ్మకం ఉందనే విషయాన్ని.. ప్రభుత్వ వ్యతిరేకతను చాటారు. ఈ తీర్పును తిరుగుబాటుగా చూడాలి. ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఓటేశారు. ఉగాది పంచాంగాన్ని ప్రజలు రెండు రోజుల ముందే చెప్పారు.’ అని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు:
వచ్చే ఎన్నికలు జగన్ పర్సెస్ పబ్లిక్.
జగన్ అరాచకాలు కొనసాగాలా..? రాష్ట్ర భవిష్యత్తు కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారు.
పులివెందుల్లోనూ తిరుగుబాటు మొదలైంది.
తొటి వాళ్లను నేరాల్లో భాగస్వామ్యం చేయడం జగన్ నైజం.
అధికారులను.. పారిశ్రామిక వేత్తలను జైళ్లకు తీసుకెళ్లారు.
ఇప్పుడు ఏపీ ప్రజలను క్రైమ్ లో భాగస్వాములను చేయాలని చూస్తున్నాడు.
చెడుకు ఎప్పటికైనా ఓటమి ఖాయం.
జగన్ పని అయిపోయింది.
జగన్ ఇక ఏ ఎన్నికల్లోనూ గెలిచేదే లేదు.
వైసీపీ గాలికి వచ్చిన పార్టీ గాలికే కొట్టుకుపోతారు.
ప్రజలని నిత్యం మోయం చేసిన పట్యించుకోరనే ధీమా జగనులో ఉండేది.
మేం ప్రజాస్వామాన్ని నమ్మితే.. జగన్ అరాచకాలను నమ్మాడు.