తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ నాయకుడు కేశవరావు నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ హోదాను కల్పించారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేశవరావు ఇటీవల బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కూడా రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు.