స్వతంత్ర వెబ్ డెస్క్: గంగవరం పోర్టు(Gangavaram Port) నిర్వాసితుల ఆందోళనతో యాజమాన్యం దిగి వచ్చింది. కార్మికుల డిమాండ్లకు(Workers’ Demands) రాత పూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. మీడియాతో ఆర్‌డీఓ హుస్సేన్ సాహెబ్ అదానీ(RDO Hussain Saheb Adani) పోర్ట్ యాజమాన్యంతో మాట్లాడారు. ప్రతీ కార్మిక కుటుంబానికి వన్ టైం పేమెంట్ కింద రూ.10 వేలు వెంటనే చెల్లించే విధంగా అంగీకరించింది. వార్షిక ఇంక్రిమెంట్(Annual Increment) ఐదు శాతంతో పాటు అదనంగా ఏప్రిల్ 24 నుంచి ప్రతీ కార్మికునికి వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. డెత్ బెనిఫిట్స్(Death Benefits) కింద ఈఎస్ఐ(ESI) నిబంధనల మేరకు రూ.25 లక్షలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.
తొలగించిన ఐదుగురు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు పోర్టు యాజమాన్యం అంగీకరించింది. అదానీ యాజమాన్యం రాక ముందు తొలగించిన ఇద్దరు కార్మికులను మాత్రం తీసుకునేందుకు అంగీకరించలేదు. అలాగే దీక్షలు చేస్తున్న సమయానికి జీతాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించలేదు. యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వ హామీలతో బ్యాంకు రుణాలకు ఆర్డీవో హామీ ఇచ్చారు. యాజమాన్య హామీలను కార్మికులకు ఆర్డీవో వివరించారు.