సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అవుతున్నారు కుడా.. ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షాట్స్, రీల్స్ చేస్తూ నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు.. స్టార్ స్టేటస్ కూడా వీరి సొంతమౌతుంది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కూడా కొల్లగొడుతు న్నారు. కానీ, విశాఖకు చెందిన ఈ అమ్మడి రూటే సెపరేట్. నటిగా పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకోవాల్సిన ఈ సమయంలో చేతివాటం ప్రదర్శించి జైలు పాల య్యింది ఈ సెలబ్రిటీ. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, నటి సౌమ్య శెట్టి అలియాస్ సౌమ్య కిల్లంపల్లి.. దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…ఈ కిలాడీ లేడీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
గత నెల 23న విశాఖ నగరం దొండపర్తి ప్రాంతం బాలాజీ మెట్రో రెసిడెన్సీలోని ప్లాట్ నంబర్ 102లో భారీ చోరీ జరిగింది. 150 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు యాజమాని ప్రసాద్ బాబు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన డీసీపీ క్రైం వెంకటరత్నం ఆధ్వర్యంలో ఏడీసీపీ గంగాధర్ ఇంటికి చేరుకోని ఇళ్లతోపాటు ఇంట్లో బీరువాను పరిశీలించారు. బీరువాపై ఉన్న వేలిముద్రలను క్లూస్ టీం సేకరించింది. ఫ్లాట్ బయట ఉన్న సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. అయితే బాధితుడు 11 మందిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి.. 11 మందిపై విచారణ ప్రారంభించారు. వీరిలో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సౌమ్యనే ప్రధాన నిందితురాలిగా పోలీసులు నిర్ధారించారు.
గోపాలపట్నం పాలిమర్స్ కు చెందిన సౌమ్యశెట్టి ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. ఆమె ట్రిప్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం శివమ్ అనే మూవీ కూడా చేస్తోంది. జనపలా ప్రసాద్ కుమార్తె, మరో ఇన్ ఫ్లూయెన్సర్ మౌనిక అనే అమ్మాయితో 2016లో సౌమ్యకు పరిచయం ఏర్పడింది. ఆమెతో పరిచయం పెంచుకుని..8ఎళ్లుగా వారితో నమ్మకంగా నటించి తరచుగా మౌనిక ఇంటికి వెళ్లేది. నేరుగా బెడ్ రూంలోకి వెళ్లి అక్కడ బాత్రూమ్ వాడుకుంటూ ఉండేది. గదిలోకి వెళ్లిన ప్రతిసారి.. గంటలు గంటలు ఉండేది. అలా రెండు మూడుసార్లు చేసింది సౌమ్య. అలా వెళ్లిన ప్రతిసారి చేతివాటం ప్రదర్శించి సుమారు కేజీ బంగారం కొట్టేసింది.
ఈనేపథ్యంలోనే యలమంచిలిలో బంధువుల వివాహానికి గత నెల 23న మౌనిక కుటుంబ సభ్యులు బయలు దేరారు. ఆభరణాల కోసం బీరువాలో లాకర్ తెరవగా.. అందులోని 150 తులాల బంగారు ఆభరణాలు కనిపించక పోవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులను ఆశ్ర యించి ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు అసలు గుట్టు విప్పారు. ఆమె నుండి 74 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మెుత్తం మీద ఈ కిలేడీ లేడీ వ్యవహారం బయటకు వచ్చింది. ఫేమస్ అయ్యాక కూడా చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలిచింది సౌమ్య. సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 రోజుల రిమాండ్‌కు తరలించారు.


