హైదరాబాద్ వేదికగా నేటి నుంచి ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియం వేదికగా భారత్ , సిరియా, మారిషస్ దేశాల జట్లు తలపడనున్నారు. ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ మ్యాచులకు అనుగుణంగా గచ్చీబౌలీ స్టేడియాన్ని పునరుద్దిరించింది ప్రభుత్వం. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫుట్ బాల్ కప్ మ్యాచులు జరగనున్నాయి. తెలంగాణలో ఫుట్‌బాల్ ఆటను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇంటర్ నేషనల్ మ్యాచులను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇవాళ జరిగే మొదటి మ్యాచ్‌లో భారత్ , మారిషస్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7గంటల 30 నిమిషాలకు భారత్, మారిషస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫుట్ బాల్ మ్యాచుల సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు.