Pavan Kalyan | దేశాభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యాన్ని కలిగిన కార్మిక లోకానికి నా తరఫున, జనసేన పార్టీ పక్షాన మే డే శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రమ శక్తిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. చెమట చుక్కలు చిందించి శ్రామిక లోకం చేసే కష్టం.. ఆర్థిక పురోగతికి ఇంధనం లాంటిదని తెలిపారు. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సంఘటిత రంగంలోని కార్మికులు తమ బాధలు వెల్లడించుకొనేందుకు వేదికలు ఉన్నా వారి సమస్యలు ఎన్నో అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయని ఆవేదన చెందారు. కష్ట జీవుల పక్షాన ఎల్లవేళలా జనసేన అండగా నిలబడుతుందని తెలిపారు.