Andrapradesh: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు (మం) కిండలంలో మృతులు పెరగటం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో అనారోగ్యంతో ఐదుగురు మృతి చెందారు. గోమాంగి ప్రైమరీ హెల్త్ సెంటర్ దూరంగా ఉండడంతో గ్రామంలోనే బాధితులు ఉండిపోతున్నారు. గ్రామానికి ఏదో జరిగిందని గుసగుసలు కూడా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కనీసం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కిండలం మృతుల సంఖ్య పెరుగుతున్నా… మరణాలను వైద్య శాఖ ధృవీకరించక పోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.