24.8 C
Hyderabad
Sunday, June 22, 2025
spot_img

పేపర్ లీకేజి ఎఫెక్ట్… మరో పరీక్ష వాయిదా!

TSPSC| టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర మంతటా సంచలనంగా మారడంతో ఎప్పుడు ఏ పరీక్షా వాయిదా పడుతుందోనని అభర్ధులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మరో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను వాయిదా వేస్తున్నామని..తిరిగి ఈ పరీక్షను జూన్ 17న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల సమయంలో నిర్వహించనున్నారు.

మొదటగా గ్రూప్‌-1 ప్రిలిమినరీతో పాటు డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి(DAO), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(AEE), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(AE) పరీక్షలు రద్దు కాగా.. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(TPBO), వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని కమిషన్‌ ఇప్పటికే ఖరారుచేయగా… ఈ పరీక్షను జూన్‌ 11న నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.అలాగే రద్దయిన పరీక్షలతో పాటు… వాయిదా పడిన పరీక్షలకు మరో రెండ్రోజుల్లో కొత్త తేదీలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్