సినీ పరిశ్రమకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి సినీ పరిశ్రమై గౌరవం ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీప వేమగిరిలో శనివారం రాత్రి నిర్వహించిన గేమ్ చేంజర్ సినీ వేడుకలో ఆయన పాల్గొన్నారు.ఈ ఈవెంట్ కు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు,.
సినీ పరిశ్రమ అడగ్గానే టికెట్లు పెంచుతున్నామని.. తప్పుగా అనుకోవద్దని డిమాండ్ సరఫరా ఆదారంగానే ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేశారాయన.తెలుగు సినిమాకు ప్రపంచంలో మార్కెట్ పెరిగిందని చెప్పారు.దర్శకుడు శంకర్ తీసిన సినిమా జెంటిల్ మెన్ సినిమాను బ్లాక్ లో టికెట్ కొనుక్కొని చూశానని.. అలా బ్లాక్ లో టికెట్ కొనుక్కుంటే ప్రయోజనం ఉండదని .. సినిమా టికెట్ కొనుక్కుంటే పరిశ్రమకు వెళ్తుందని చెప్పారు. సినిమా బడ్జెట్ కూడా పెరిగిందని.. ప్రతి రూపాయికీ 18 శాతం జీఎస్టీ వస్తుందని చెప్పారు.
తన సినిమా బీమ్లా నాయక్ సినిమాకు టికెట్ దరలు పెంచకపోగా.. తగ్గించారని గుర్తు చేశారు. చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూటమి మద్దతు తెలపలేదని చెప్పారు.అయినా తాము సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని .. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం లేదని వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. సినిమా టికెట్ల ధరల విషయంలో హీరోలకు పనిలేదని అన్నారు. వారు వచ్చి ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం లేదన్నారు. నిర్మాతలు, ట్రేడ్ బాడీ, యూనియన్లు వచ్చి మాట్లాడితే సరిపోతుంది. అంతేగానీ హీరోలు వచ్చి తమకు నమస్కారం చేయాల్సిన అవసరం లేదన్నారు పవన్ కళ్యాణ్. సినిమా సాధక బాధలు తెలిసిన వారే మాట్లాడాలని.. వారితోనే కూటమి ప్రభుత్వం మాట్లాడుతుందని వపన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదంతా నటుడు దివంగత ఎన్టీఆర్ ని చూసి నేర్చుకున్నానని పవన్ చెప్పారు.
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు క్రుష్ణ కాంగ్రెస్ లో ఉన్నా ఎప్పుడూ వివాదాలు రాలేదని అదీ చిత్ర పరిశ్రమ ఔదార్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు.