గిన్నిస్ రికార్డులో పేరు నమోదు చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో ఫీట్ చేస్తుంటారు. ఎవరూ చేయలేని పని చేసి…అందరితో …ఔరా అనిపించుకుంటారు. అప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చేయని పని చేస్తే…సదరు ఫీట్..చరిత్రలో నిలిచిపోతుంది. ముందుగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కుతుంది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పనికెర ఇదే పనిచేశాడు. ఒక అరుదైన ఫీట్ చేసి…అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు.
సహజంగా ఎలెక్ట్రిక్ ఫ్యాన్ దగ్గర చేయి పెట్టడానికి అందరూ భయపడతారు. ఫ్యాన్‌కు దగ్గరగా చేయి పెడితే….ఎక్కడ కట్ అవుతుందో అని ఆందోళన పడతారు. అయితే క్రాంతి కుమార్ పనికెర ఇందుకు మినహాయింపు. ఎలెక్ట్రిక్ ఫ్యాన్ల విషయంలో క్రాంతి కుమార్‌కు అసలు భయమనేదే ఉండదు. ఒకే ఒక్క నిమిషంలో తన నాలుకతో 57 ఎలెక్ట్రిక్ ఫ్యాన్లను ఆపి..వరల్ట్ గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించాడు ఈ సూర్యాపేట వాసి.
సహజంగా అత్యంత సాహసోపేతమైన విన్యాసాలు చేసేవారిని డ్రిల్ మాన్ అని పిలుస్తారు. శరీరంలో అతి సున్నితభాగమైన నాలుకతో కేవలం నిమిషం వ్యవధిలో 57 ఎలెక్ట్రిక్ ఫ్యాన్లను ఆపడం అంటే మాటలు కాదు. ఈ అరుదైన ఫీట్‌ను అవలీలగా చేశారు క్రాంతి కుమార్ పనికెర. బ్రేవో క్రాంతి కుమార్.