26.2 C
Hyderabad
Monday, September 29, 2025
spot_img

టీం ఇండియా ఓపెనర్ల ధాటికి కరేబియన్ జట్టు విలవిల..!

స్వతంత్ర వెబ్ డెస్క్: వెస్టిండీస్‌తో (West Indies) జరిగిన నాలుగో టీ20లో భారత ఓపెనర్లు(Indian openers) చెలరేగిపోయారు. విండీస్ నిర్ధేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని శుభమాన్ గిల్(77)(Subhaman Gill), యశస్వి జైస్వాల్(84 నాటౌట్)( Yashaswi Jaiswal) జోడి పోటీపడి మరీ చేధించారు. వీరిద్దరి ధాటికి కరేబియన్ జట్టు బౌలర్లకు ఆకాశం వైపు చూడటం తప్ప.. మరొక సమాధానమే లేకపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా(Team India) 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్(Windies) నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల న‌ష్టానికి 178 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్(61; 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచ‌రీ చేయగా.. షై హోప్‌(45; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో పర్వాలేదనిపించారు.

భార‌త బౌల‌ర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకోగా.. కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం 179 పరుగుల లక్ష్య చేధనకు దిగిన భారత ఓపెనర్లు శుభమాన్ గిల్(77; 47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్(84 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) పది ఓవర్లు ముగిసేసరికి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. వీరిద్దరూ పోటీ పడి మరీ బౌండరీలు బాదారు. గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. జైస్వాల్ 33 బంతుల్లో అర్ధ సెంచరీ మార్కు చేరుకున్నాడు. ఒక ఓవర్ నీకు.. ఒక ఓవర్ నాకు అన్నట్లు వీరి బ్యాటింగ్ సాగింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్