నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఓ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారి చర్చకు దారితీసింది. జెండా మోసి, ప్రజల చేత పార్టీకి ఓట్లు వేయిస్తే బీజేపీ ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు బదులుగా రామా రావు పటేల్ అతని ఒక్క ఓటుతోనే గెలవలేదని తన అవసరం కోసం ఓటు వేశాడని అన్నారు. ఒక్క ఓటుతో తనను కొన్నావా అంటూ ఎమ్మెల్యే కార్యకర్తపై మండిపడ్డారు. ఈ విషయం కాస్త ఎమ్మె ల్యే దృష్టికి వెళ్లగా దురుద్దేశంతో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దానిపై వివరాలు సేకరించాక స్పందిస్తానన్నారు.


