ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ యేడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 256ని విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇటీవల కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుద ల చేయడంతో పాత డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.