24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

‘తంగలాన్’ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది: చియాన్ విక్రమ్

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. ఈ రోజు “తంగలాన్” చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో విక్రమ్ మాట్లాడుతూ – పా రంజిత్ నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన తీసిన ప్రతి సినిమా నాకు ఇష్టం. పా రంజిత్ తో మూవీ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆయన “తంగలాన్” కథ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఇది తెలుగు, తమిళ, కన్నడ అని కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ. బంగారం వేట అనేది హైలైట్ అవుతున్నా..ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది. ఇది ఒక వర్గానికి ఆపాదించలేం. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు అసమానతలకు గురవుతూ ఉంటాం. అలాంటి వారి కోసం దర్శకుడు పా రంజిత్ సినిమా అనే మాధ్యమం ద్వారా తన అభిప్రాయాలు చెబుతున్నారు. సార్పట్ట సినిమా చూసినప్పుడు ఆ కథలోకి లీనమవుతాం గానీ మిగతా విషయాలు పట్టించుకోం. అలాగే ఈ సినిమా కథ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టే పేర్లు, మాటలు ఈ సినిమాలో ఉండవు. ఆ జాగ్రత్తలు దర్శకుడు పా రంజిత్ తీసుకున్నారు. “తంగలాన్” అనేది ఒక తెగ పేరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుక్స్ చూసినప్పుడు ఒక్కోసారి ఒక్కో అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ టైమ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇది కేజీఎఫ్ లా ఉంటుందా అన్నారు. మరోసారి తెగ నాయకుడి గెటప్ రిలీజ్ చేసినప్పుడు ఇది రా అండ్ రస్టిక్ గా ఉంటుందని అన్నారు. కానీ “తంగలాన్” లో అన్ని అంశాలు ఉన్నాయి. క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొన్ని గంటల పాటు మేకోవర్ కు పట్టేది. మళ్లీ మేకప్ తొలగించుకునేందుకు కనీసం రెండు గంటలు అయ్యేది. చలిలో, వేడిలో అలాగే షూటింగ్ చేశాం. మనకు ఇష్టమైన పని దొరికినప్పుడు ఆకలి, నిద్ర మర్చిపోతుంటాం. అలా నేను నా సినిమాల్లో నటిస్తున్నప్పుడు మిగతా విషయాలేవీ పట్టించుకోను. ఆ పాత్రకు తగినట్లు మారానా లేదా అనేదే ఆలోచిస్తాను. అవార్డులు నాకు ఇష్టమే. కానీ మీ నుంచి వచ్చే ప్రశంసలు మరింత సంతోషాన్ని ఇస్తాయి. ఆఫ్రికన్ ట్రైబ్స్ సహా ప్రపంచంలోని కొన్ని తెగలు ఎలా ఉంటాయో నేను తెలుసుకున్నాను. అవి ఈ మూవీ చేయడంలో హెల్ప్ అయ్యాయి. నాతో పాటు ఆర్టిస్టులంతా సింగిల్ షాట్ లో సీన్స్ చేశాం. ఆ సీన్ లో 30 టేక్స్ ఉన్నా..సింగిల్ షాట్ లోనే చేసేవాళ్లం. ఇవాళ సినిమాకు భాషాంతరాలు లేవు. పాన్ ఇండియా అని మనమే అంటున్నాం. నేను ఎక్కడ నటించినా అది అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. థియేటర్ లో మిమ్మల్ని ఈ సినిమా సర్ ప్రైజ్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వర్క్ అంటే నాకు ఇష్టం. ఆయన పదేళ్లు రాజకీయాల్లో కష్టపడి ఇప్పుడు డిఫ్యూటీ సీఎం అయ్యారు. అది సాధారణ అఛీవ్ మెంట్ కాదు. మాలాంటి వాళ్లకు పాలిటిక్స్ లోకి రావాలనుకుంటే ఆయన ఒక హోప్ ఇచ్చినట్లు అయ్యింది. అన్నారు.

హాలీవుడ్ నటుడు డేనియల్ మాట్లాడుతూ – “తంగలాన్” సినిమా కోసం పా రంజిత్ నన్ను అప్రోచ్ అయ్యారు. మేము చాలా సార్లు మాట్లాడుకున్నాం. నేను ఆయన సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా చదవకుండా నటించేందుకు ఒప్పుకున్నాను. పా రంజిత్ విజన్ ఎలా ఉంటుందో తెలుసు. ఆయన ఆలోచనలు కొత్తగా ఉంటాయి. నా క్యారెక్టర్ కొంత క్లే షేడ్స్ తో ఉంటుంది. విక్రమ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను నా బ్రదర్ లాంటి వారు. ఇండియన్ సినిమా ఎనర్జీ, స్పాన్ చాలా పెరిగింది. హాలీవుడ్ ను ఇండియన్ సినిమా దాటేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. అంతర్జాతీయంగా అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీస్ చేస్తే ఇండియన్ సినిమా హాలీవుడ్ ను దాటేస్తుంది. అన్నారు.

హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుూ – నేనెప్పుడూ నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే కథల్లో, క్యారెక్టర్స్ లో నటించాలని కోరుకుంటాను. “తంగలాన్” సినిమాతో అలాంటి అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఆరతి అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ క్యారెక్టర్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. విక్రమ్ గారితో కలిసి నటించడం గొప్ప ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. విక్రమ్ గారు లేకుంటే నేను ఈ సినిమాలో ఆరతి క్యారెక్టర్ ను ఇంత బాగా పర్ ఫార్మ్ చేసేదాన్ని కాదేమో. ఎందుకంటే తంగలాన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాణమైన ఒక టఫెస్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. ఈ సినిమాలో నటించేప్పుడు మేము ఈ పాత్రలు సరిగ్గా చేయగలమా లేదా ఈ సినిమాలో నటించడం చాలా కష్టంగా ఉంది అని చాలాసార్లు అనుకున్నాం. నాకే కాదు మా అందరిలోనూ అదే ఫీలింగ్ ఉండేది. చియాన్ విక్రమ్ లాంటి కోస్టార్ లేకుంటే నేను ఇంత బాగా నటించలేకపోయేదాన్ని. తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది. ఒక బ్యాంగ్ లాంటి సినిమాతో టాలీవుడ్ కు రావాలని వెయిట్ చేస్తూ వచ్చాను. రాజా సాబ్ సినిమాతో నాకు అలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన హైదరాబాద్ లోని బెస్ట్ పుడ్ నాకు పంపారు. మా మదర్ చేసిన ఫుడ్ అంత టేస్ట్ గా ఆ ఫుడ్ ఉంది. మారుతి గారు ఫీమేల్ క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేస్తారు. తంగలాన్ లో నా క్యారెక్టర్ కు రాజా సాబ్ లో నా క్యారెక్టర్ తో చూస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. అన్నారు.

హీరోయిన్ పార్వతీ తిరువోతు మాట్లాడుతూ – “తంగలాన్” సినిమాలో మేమంతా మా క్యారెక్టర్స్ చేశాం. నటీనటులుగా మా పని ఫినిష్ చేశాం. ఇక ఇప్పుడు ప్రేక్షకుల తీర్పు కోసం వేచి చూస్తున్నాం. ఈ సినిమాలో మా డైరెక్టర్ పా రంజిత్ ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు. అందరికీ రిలేట్ అయ్యేలా మూవీ ఉంటుంది. ఆడియెన్స్ మమ్మల్ని ఈ మూవీతో ఎంతగా ఆదరిస్తారని చూడాలనుకుంటున్నాం. అన్నారు.

Latest Articles

BREAKING: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్‌ కేసులో బెయిల్‌ రద్దు చేయాలన్న గత ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎం బేలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్