31.4 C
Hyderabad
Tuesday, June 25, 2024
spot_img

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు

  ఇరాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్‌ – ఇరాన్ మధ్య గతంలో పరోక్ష యుద్ధాలు నడిచాయి. అయితే ఈ రెండు దేశాలు ముఖాముఖి తలపడటం ఇదే తొలిసారి. ఇరాన్‌లోని అణు స్థావరాలను ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ఎప్పటినుంచో భావిస్తోంది. ఇరాన్ తాజా దాడులతో ఇజ్రాయెల్‌కు ప్రతిదాడులు చేసే అవకాశం దొరికింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ – ఇరాన్ దాడుల అంశానికి కొన్ని దేశాలు దూరంగా ఉంటున్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, ఒమన్, కువైట్, ఖతర్‌ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. తమ దేశాల్లోని సైనిక స్థావరాలను, గగనతలాన్ని ఇజ్రాయెల్ ఉపయోగించుకోకుండా ఈ దేశాలు నిషేధం విధించాయి. రెండు దేశాల యుద్దం వివాదంలోకి తమను లాగకుండా ఈ దేశాలు ముందుగా జాగ్రత్తపడ్డాయి.

    ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు లభిస్తున్నాయి. దాదాపు మూడు నెలలుగా హమాస్‌పై దాడులు చేయడంతో ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి మళ్లీ ఆయుధాలు లభించడంతో ఇజ్రాయెల్ సైనికవర్గాల్లో జోష్ పెరిగింది. సైనిక పరంగా ఇరాన్‌ – ఇజ్రాయెల్ రెండూ శక్తివంతమైన దేశాలే. జనాభా, విస్తీర్ణం ప్రకారం చూస్తే ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్‌ చాలా పెద్ద దేశం. సైనిక బలం పరంగా చూస్తూ ఇరాన్ ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉంది. ఇరాన్ సాయుధ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను భారీ సంఖ్యలో పోగేసుకుంది.ఇరాన్ దగ్గర మూడు వేల వరకు బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయంటారు రక్షణ రంగ నిపుణులు. ఈ బాలిస్టిక్ క్షిపణుల ను ప్రయో గిస్తే పావుగంటలోగా ఇజ్రాయెల్ భూభాగంలో పడతాయి. అయితే క్రూజ్ క్షిపణులకు రెండు గంటలు పడుతుంది.

   సాయుధ డ్రోన్లకు సంబంధించి ప్రపంచంలోనే ఇరాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. ఇరాన్ నుంచి రష్యా సహా అనేక దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్లు ఇరాన్ దేశం ఉత్పత్తి చేసినవే. కొన్ని నెలల కిందట మెహెజర్ – 10 అరు అధునాతన డ్రోన్‌ను ఇరాన్ అభివృద్ది చేసింది. మెహెజర్ – 10 డ్రోన్, రెండు వేల కిలోమీటర్ల దూరం పయనించగలదు. అంతేకాదు ఆయుధాలతో ఏకబిగిన 24 గంటలపాటు గగనవిహారం చేయగలదు. ఇరాన్ అణ్వాయు ధాలు తయారు చేయడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అవి వార్‌హెడ్‌లో అమర్చ డానికి అనువుగా ఉన్నాయా అనే దానిపై స్పష్టత లేదు. అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న ఆరోపణ లు రావడంతో 1979 నుంచి ఇరాన్‌పై వివిధ రూపాల్లో అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఇరాన్‌ దగ్గర పెద్ద ఎత్తున సంప్రదాయ ఆయుధాలు పోగుపడ్డాయి.అయితే వీటిలో చాలావరకు కాలం చెల్లినవే అంటున్నారు రక్షణరంగ నిపుణులు.

   ఇజ్రాయెల్‌ను కూడా సైనికపరంగా బాగా అభివృద్ది చెందింది. సైనికపరంగా ప్రపంచంలో ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉంది. ఇజ్రాయెల్ దగ్గర భారీ సంఖ్యలో శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి. వీటినే జెరికో  ఒన్‌, టూ, త్రీ పేరుతో పిలుస్తారు. అంతేకాదు పెద్ద ఎత్తున ఖండాంతర అస్త్రాలు కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. ఇరాన్‌తో పోలిస్తే ఇజ్రాయెల్ దగ్గర అధునాతన ఆయుధ సంపత్తి ఉంది. గగనతల రక్షణలో ఇజ్రాయెల్ తిరుగులేని శక్తి. ప్రత్యర్థి క్షిపణులను గాల్లోనే పేల్చివేయగల పేట్రియాట్, యారో, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ వంటి రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ దగ్గర భారీగానే ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద కూడా డ్రోన్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ దగ్గర 90 అణుబాంబులు ఉన్నట్లు సమాచారం. మొత్తంమీద సైనికపరంగా బలమైన రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభ మైంది. ఈ యుద్దం కారణంగా ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నీ రెండు శిబిరాలుగా ఈపాటికే విడిపోయాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాలు ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. దీనికి కౌంటర్‌గా రష్యా, చైనా సహా మరికొన్ని దేశాలు ఇరాన్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చివరకు మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు అంతర్జాతీయ రంగ నిపుణులు.

Latest Articles

రాజన్న కోడెల సంరక్షణ పట్ల అధికారుల నిర్లక్ష్యం

      రాజన్నకు కోడె కడితే కోరిన కోర్కెలు తీరుతాయి. దంపతులు కోడె మొక్కు తీర్చుకుంటే పండంటి సంతానం కలుగుతుంది. ఇదీ వేములవాడ రాజన్నపై భక్తుల విశ్వాసం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్