హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డు కార్యాలయంను AISF నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ప్రైవేటు కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఫీజులను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనుమతుల్లేని కళాశాలలను సీజ్ చేయడంతోపాటు నిబంధనలను పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మాప్రతినిధి విశాల్ అందిస్తారు.