32.5 C
Hyderabad
Friday, February 27, 2026
spot_img

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఉన్నతంగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం చేయాలి.. డాలర్లు సంపాదించాలి.. ఇలాంటి కలలు కనడమే తప్పైపోతుంది. అక్కడి గన్‌ కల్చర్‌కు స్వదేశీయులే కాదు భారతీయ విద్యార్థులు కూడా బలవుతున్నారు. కష్టపడి చదివించి.. ఉన్నత చదువుల కోసం అప్పు చేసి మరీ తమ బిడ్డను అమెరికాకు పంపిస్తే.. చివరికి వారి మృతదేహాలు తిరిగొస్తుంటే తల్లిదండ్రులు పడే బాధ, వేదన అంతా ఇంతా కాదు. చేతికందొచ్చిన బిడ్డలు విగతజీవులుగా మారడం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు-రమాదేవి దంపతులకు కొడుకు ప్రవీణ్(27)‌, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రవీణ్‌ కొంతకాలం కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ విస్కాన్సిన్‌ మిల్వాంకిలో నివాసం ఉంటున్నాడు. అక్కడే యూనివర్సిటీలో ఎంఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఖర్చుల కోసం ఓ స్టార్‌ హోటల్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రవీణ్‌ నివాసం ఉండే ఇంటికి సమీపంలోని బీచ్‌ దగ్గర తాజాగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రవీణ్‌ అక్కడికక్కడే మరణించారు.

ప్రవీణ్‌ మరణవార్తను అతని స్నేహితులు ఇండియాలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రవీణ్‌ మృతితో కేశంపేట మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్