ప్రముఖ గాయని కల్పన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నిజాంపేటలోని తన విల్లాలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. నిద్రమాత్రలు మింగిన నాలుగు గంటల తర్వాత వైద్యులు… కల్పన స్టమక్ వాష్ చేశామని చెప్పారు. తర్వాత వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని.. ఆక్సిజన్‌పై ఉన్నారని తెలిపారు.
మరోవైపు ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసుకున్నారో పోలీసులు తెలుసుకున్నారు. కల్పన కొంత కోలుకున్న తర్వాత ఆమె స్పృహలోకి వచ్చారు. ఇప్పటికే గతంలోనూ ఆమె డిప్రెషన్‌లో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది రెండో సారి. ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేశారు పోలీసులు.
గాయని కల్పన స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు.. తన పెద్ద కుమార్తెను చదువుకోవడానికి హైదరాబాద్ రావాలని కోరానని.. తన మాటలను కుమార్తె పట్టించుకోలేదని చెప్పారు. ప్రస్తుతం కేరళలో ఉంటున్న పెద్ద కుమార్తె తన మాట వినకపోవడం వల్లే తాను నిద్రమాత్రలు మింగానని పోలీసులకు చెప్పారామె. కేరళలో కాకుండా హైదరాబాద్ వచ్చి చదువుకోవాలని కోరానని.. అయితే తన మాట నిరాకరించడంతో మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు కల్పన తన స్టేట్‌మెంట్‌లో తెలిపారు.