స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ వర్సిటీ ఉపకులపతి దాచేపల్లి రవీందర్ అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. తార్నాకలోని తన నివాసంలో రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం వీసీ ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల అధికారులు వర్సిటీలో సోదాలు జరిపారు. వర్సిటీలో అక్రమ నియామకాలకు సంబంధించిన ఆధారాలను ఈ సోదాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వర్సిటీ తరఫున పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు రవీందర్ గుప్తా డబ్బులు డిమాండ్ చేశారంటూ ఓ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనలతో వీసీకి లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.