తెలంగాణలో గృహ హింస కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆధునిక సమాజంలోనూ మహిళలు గృహ హింసలు ఎదుర్కొంటున్నారు. దేశంలో గృహ హింస కేసులకు సంబంధించిన నివేదికను కేంద్ర గణాంక మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ‘విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2022’ సర్వే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 75శాతం గృహ హింస కేసులతో అసోం రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. 50.4శాతం కేసులతో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. 48.9శాతం కేసులతో ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది. ఇక మూడవ వంతు కేసులు భర్త, బంధువులు చేస్తున్న దాడులే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న దాడుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.