TSPSC పేపర్ లీకేజ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి సిట్(SIT) అధికారులు నోటీసులు జారీ చేశారు. పేపర్ లీకేజీకి సంబంధించి రేవంత్ చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తగిన ఆధారాలు సమర్పిస్తే ఆ దిశగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా మంత్రి కేటీఆర్ సొంత మండలంలో గ్రూప్1 పరీక్ష రాసిన వారిలో చాలా మందికి 100కు పైగా మార్కులు వచ్చాయని.. ఇది అనేక అనుమానాలకు తావిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఎవరెవరికి 100కు పైగా మార్కులు వచ్చాయి? ఆ మార్కులు పొందిన వారి వివరాలు సమర్పించాలని అధికారులు కోరారు. రేవంత్ రెడ్డితో పాటుగా ఆరోపణలు చేసిన నేతలకు సిట్ అధికారులు నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.