Minister Gangula Kamalakar |ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు మండిపోతున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ.. మహిళల దినోత్సవం నాడు కవిత కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారని అన్నారు. మహిళ దినోత్సవం సందర్బంగా మోడీ అడబిడ్డల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నాడని.. కవితకు నోటీసులు ఇవ్వడం వెనుక బీజేపీ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు.