స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొనే సత్తా ఒక్క బీజేపీకే ఉందని వ్యాఖ్యానించారు. బిజెపి అంటే సెక్యులర్ పార్టీ అని అన్నారు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లిని కూడా బిజెపిలో చేరాలని ఆకాంక్షించారు. తాను బిజెపిని వీడి ఎక్కడికి వెళ్లడం లేదని.. బిజెపి పై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ఇతర పార్టీలలోనే కన్ఫ్యూజన్ ఉంది కానీ బీజేపీలో లేదన్నారు. కాంగ్రెస్ పార్టీయే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పార్టీ అని వ్యాఖ్యానించిన కొండా.. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడు అరెస్ట్ అనేది మా చేతిలో లేదన్నారు. ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీ ఎవరిని అరెస్టు చేయలేదని అన్నారు.