పదో తరగతి పేపర్ లీక్ కేసులో అరెస్టై బెయిల్ పై విడుదలైన బండి సంజయ్(Bandi Sanjay) కు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఫోన్ చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా(Amit shah), బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీ స్మృతి ఇరానీ, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తదితరులు ఫోన్ చేసి సంజయ్ ని పరామర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాటం మరింత ఉధృతం చేయాలని సూచించారు. ‘గో ఎహెడ్.. హైకమాండ్ మీకు అండగా ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. కాగా ఇవాళ ఉదయం సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు.
Read Also: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
Follow us on: Youtube, Instagram, Google News