Mahabubabad |దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా శాంతించిన కరోనా.. మళ్ళీ నేనున్నా మర్చిపోవద్దు అంటూ.. తన ఉనికిని చాటుకోవడానికి వచ్చేస్తుంది. తాజాగా, తెలుగురాష్ట్రాల్లో కూడా గణనీయమైన కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఓ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. గురువారం మహబూబాబాద్(Mahabubabad) గిరిజన పాఠశాలలోని 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో పాఠశాల ఉపాధ్యాయులతోపాటు… విద్యార్థులు కూడా భయాందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ వైద్యసిబ్బంది కరోనా టెస్టులు చేశారు. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. పాఠశాల విద్యార్థులు కూడా కొన్ని రోజులు అందరితో కలవకుండా కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు.
Read Also: పోలీస్ కమిషనర్ అయితే నాకేంటి.. నా డ్యూటీ నేను చేస్తున్నా
Follow us on: Youtube, Instagram, Google News