Governor Tamilisai |గవర్నర్ తమిళిసై వ్యవహారశైలిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై సుప్రీంలో రిట్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ లో ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చింది. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముంది. ఏకంగా గవర్నర్ పై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. కాగా గత కొన్ని రోజులుగా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్(CM KCR) మధ్య విభేదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ బీజేపీ(BJP) ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం.. తన పదవిని ప్రభుత్వం లెక్కచేయడం లేదని గవర్నర్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
Read Also: మోదీని ఎదురిస్తే అరెస్ట్ చేస్తారా? భయపడేదే లేదు: కవిత
Follow us on: Youtube