డ్రగ్స్ ను పూర్తిగా నివారించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో పబ్స్ కేంద్రంగానే డ్రగ్స్ కల్చర్ మొదలైంది. ఇకపై డ్రగ్స్ ను పసిగట్టేందుకు ప్రతి పబ్ క్లబ్స్ వద్ద స్నిప్పర్ డాగ్స్ ను ప్రవేశపెడుతోంది నార్కోటిక్ టీమ్. ఈ స్నిప్పర్ డాగ్స్ కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరీ వీకేండ్స్ లో పబ్స్, క్లబ్స్ లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని పబ్స్ లలో డ్రగ్స్ విక్రయం, వినియోగం గణనీయంగా పెరిగిపోవడంతో నార్కోటిక్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక నిఘా పెట్టారు. ఇటీవల కాలంలో పలు వురు డీజేలు పబ్ లకు వస్తున్న కస్టమర్లను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కొందరు డీజేలను అరెస్ట్ చేశారు. వీకెండ్స్ లో ముఖ్యంగా కాస్మో కల్చర్ ఎక్కువగా ఉండే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పబ్ లతో పాటు జూబ్లీహిల్స్ లో తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్బుల్లోనూ సైతం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ రైడ్స్ లో నార్కోటిక్ బ్యారో శిక్షణ ఇచ్చిన స్నిపర్ డాగ్స్ తో పోలీసులు చెకింగ్ చేశారు. కేవలం వీకెండ్ లో మాత్రమే కాకుండా ప్రతిరోజూ తనిఖీలు ఉంటాయన్నారు పోలీసులు.ముఖ్యంగా పబ్స్ లో డీజేలుగా పని చేస్తున్న వారే డ్రగ్స్ సరఫరా చేసే స్థాయికి చేరుతున్నారు. దీంతో డీజేలు టార్గెట్ గా పోలీసులు తనిఖీలు చేస్తు న్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ? కస్టమర్లకు ఏ విధంగా అందజేస్తున్నారు ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గోవా, బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


